గోపీచంద్ కథానాయికగా మళ్లీ రాశీఖన్నా!
- మారుతి దర్శకత్వంలో గోపీచంద్ ప్రాజక్ట్
- టైటిల్ గా 'పక్కా కమర్షియల్' నిర్ణయం
- గోపీచంద్ తో రాశికి మూడో సినిమా
యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రానున్న సంగతి మనకు తెలిసిందే. యూవీ క్రియేషన్స్, జీఏ 2 సంస్థలు కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి 'పక్కా కమర్షియల్' అనే వెరైటీ టైటిల్ని కూడా ఇప్పటికే నిర్ణయించారు. ఇందులో కథానాయికగా రాశీఖన్నాను తాజాగా ఎంపిక చేసినట్టు సమాచారం.
విశేషం ఏమిటంటే, గోపీచంద్, రాశీఖన్నా కాంబినేషన్ కు ఇది మూడో చిత్రం. గతంలో వీరిద్దరూ కలసి 'జిల్', 'ఆక్సిజన్' చిత్రాలలో నటించారు. ఇప్పుడు ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.