Anushka Sharma: అనుష్క శర్మ సెల్ఫీ... ఇంత ఫిట్ నెస్ ఎలా సాధ్యమంటూ నెటిజన్ల ప్రశ్న!

Anushka Latest Selfy Viral in Net
  • జనవరి 11న పాపకు జన్మనిచ్చిన అనుష్క
  • తాజాగా జిమ్ లో చిత్రం
  • ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

ఇటీవల పండంటి పాపను కన్న విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ తన తాజా చిత్రాన్ని నెట్టింట పోస్ట్ చేయగా వైరల్ అయింది. జనవరి 11న విరుష్క జంటకు పాప జన్మించిన సంగతి తెలిసిందే. ఆపై ఈ దంపతులు 2వ తేదీన పాపను చేతుల్లోకి తీసుకుని దిగిన చిత్రాన్ని విడుదల చేశారుగానీ, అందులో పాప ముఖం మాత్రం కనిపించలేదు. పాపకు వామిక అని పేరును పెట్టుకున్నారు విరాట్, అనుష్కలు.

ఇక తాజాగా, ఓ అద్దం ముందు నిలబడి దిగిన సెల్ఫీని అనుష్క షేర్ చేసుకుంది. ఇది తన ఫేవరెట్ అని కూడా పేర్కొంది. ఈ పిక్ ను చూసిన నెటిజన్లంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాన్పు తరువాత ఇంత ఫిట్ నెస్ ఎలా సాధ్యమైందని ప్రశ్నిస్తున్నారు. ఆ రహస్యాన్ని తమకూ చెప్పాలని కోరుతూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News