గుర్తు తెలియని శవాన్ని స్వయంగా మోసుకొచ్చిన కాశీబుగ్గ మహిళా ఎస్సై
- శ్రీకాకుళం జిల్లాలో ఘటన
- అడివికొత్తూరులో గుర్తుతెలియని మృతదేహం
- స్ట్రెచర్ పై మోసుకొచ్చిన లేడీ ఎస్సై
- అనాథ ప్రేతానికి అంత్యక్రియలు
- ఎస్సై శిరీషకు డీజీపీ అభినందనలు
ఎస్సై శిరీష పొలం గట్లు, అటవీప్రాంతాలు దాటుకుంటూ ఓ స్ట్రెచర్ పై మోసుకురావడం పట్ల సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన వస్తోంది. ఏపీ పోలీస్ విభాగం కూడా ఎస్సై శిరీషను అభినందిస్తూ ట్వీట్ చేసింది. ఆమె వీడియోను కూడా పంచుకుంది. కాశీబుగ్గ ఎస్సై శిరీష మానవీయ దృక్పథాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ కొనియాడారు.