ధర్మస్థలి తలుపులు తెరుచుకున్నాయి... 'ఆచార్య' టీజర్ వచ్చేసింది!
- కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 'ఆచార్య'
- చిరంజీవి సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్
- ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న టీజర్
- ఎట్టకేలకు రిలీజ్ చేసిన చిత్రబృందం
"ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం... అలాంటి వాళ్ల జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు" అంటూ సాగే డైలాగుతో టీజర్ మొదలవుతుంది. అంతేకాదు, తనను 'ఆచార్య' అనడం వెనుకున్న కాన్సెప్ట్ ను కూడా చిరంజీవి వెల్లడించడం ఈ టీజర్ లో చూడొచ్చు. ఈ సినిమాను కొణిదెల ప్రొ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్స్ పతాకాలపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించాడు.