ఏమయ్యా కొరటాలా... టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తావంటూ చిరంజీవి... రేపు ప్రకటన చేస్తాను సార్ అంటూ కొరటాల... ఆసక్తికర సంభాషణ

26-01-2021 Tue 18:59
  • కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఆచార్య
  • టీజర్ ఇంకెప్పుడంటూ 'చిరు'కోపం
  • ఉదయం 10 గంటలకు ప్రకటిస్తాను సార్ అంటూ కొరటాల జవాబు
  • ట్విట్టర్ లో సంభాషణను పంచుకున్న చిరంజీవి
Chiranjeevi conversation with Koratala Siva

మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆచార్య సినిమా టీజర్ పై రేపు ప్రకటన చేయనున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి ఎంతో ఆసక్తికరమైన రీతిలో వెల్లడించారు. ఈ సాయంత్రం ఆయన ట్వీట్ చేస్తూ... దర్శకుడు కొరటాల శివతో తాను సీరియస్ గా చర్చించానని, ఆ విషయం ఏంటన్నది సాయంత్రం 6.30 గంటలకు అప్ డేట్ ఇస్తానని ట్వీట్ చేశారు. చెప్పిన సమయానికే ఆయన కొరటాలతో తన చర్చల వివరాలను చిత్ర రూపంలో పంచుకున్నారు.

ఆ సంభాషణ ఎలా సాగిందంటే...

చిరంజీవి: ఏమయ్యా కొరటాలా... ఆచార్య టీజర్ న్యూ ఇయర్ కి లేదు, సంక్రాంతికి లేదు, ఇంకెప్పుడు..?
కొరటాల: సార్, అదే పనిలో ఉన్నా!
చిరంజీవి: ఎప్పుడో చెప్పకపోతే లీక్ చేయడానికి రెడీగా ఉన్నా!
కొరటాల: రేపు ఉదయాన్నే అనౌన్స్ మెంట్ ఇచ్చేస్తాను సార్!
చిరంజీవి: ఇస్తావుగా..!
కొరటాల: అనౌన్స్ మెంట్ రేపు ఉదయం 10 గంటలకు ఫిక్స్ సార్!

ఈ సంభాషణను చిరంజీవి స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ లో పంచుకున్నారు.