తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!
Add ap7am to your home Screen

తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

316 new corona cases in telangana
  • 24 గంటల్లో 316 కరోనా కేసులు 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,81,730
  • కోలుకున్న వారు 2,73,625 మంది
  • మృతుల సంఖ్య మొత్తం 1,515
తెలంగాణలో గత 24 గంటల్లో 316 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 612 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,81,730కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,73,625 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,515కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 6,590 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో  4,467 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 86 కరోనా కేసులు నమోదయ్యాయి.
Corona Virus
COVID19
Telangana

More Telugu News