సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'మేడే' షూటింగులో జాయిన్ అయిన రకుల్
- బాలీవుడ్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న నాగార్జున
- సందీప్ కిషన్ కథానాయకుడుగా 'రౌడీ బేబీ'
* హిందీలో హిట్టయిన 'రైడ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి అక్కినేని నాగార్జున రెడీ అవుతున్నారు. ఇందులో ఆయన ఆదాయపు పన్ను అధికారిగా నటిస్తారు. అయితే, ఈ చిత్రానికి దర్శకత్వం ఎవరు వహిస్తారన్నది ఇంకా ఖరారు కాలేదు.
* యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడుగా 'రౌడీ బేబీ' అనే చిత్రం రూపొందుతోంది. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నిన్న ప్రారంభం అయింది. ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ కలసి దీనిని నిర్మిస్తున్నారు.