సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- టాలీవుడ్ మిత్రులకు కాజల్ విందు
- 'పుష్ప'కు బాలీవుడ్ నుంచి విలన్
- 'జీ తెలుగు'కు 'నిశ్శబ్దం' హక్కులు
* అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రం షూటింగును త్వరలో ప్రారంభించనున్నారు. కాగా, ఇందులో విలన్ పాత్రకు ప్రముఖ బాలీవుడ్ నటుడిని తీసుకోవాలని సుకుమార్ భావిస్తున్నాడట. ప్రస్తుతం ఆ ఎంపికలో ఉన్నట్టు తెలుస్తోంది.
* ప్రముఖ నటి అనుష్క కథానాయికగా రూపొందిన 'నిశ్శబ్దం' చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్టుగా విడుదలైన విషయం తెలిసిందే. అయితే, చిత్రానికి అనుకున్నంతగా ప్రేక్షకాదరణ మాత్రం లభించలేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానెల్ సొంతం చేసుకుంది.