తన కార్యాలయ ఉద్యోగి పెళ్లికి సతీసమేతంగా విచ్చేసిన సీఎం జగన్

CM Jagan attends marriage of CMO subordinate Raviprasad
ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తున్న బి.రవిప్రసాద్ అనే ఉద్యోగి వివాహానికి సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. తాడేపల్లి సీఎస్ఆర్ కల్యాణమంటపంలో ఈ పెళ్లి జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి సీఎం జగన్, వైఎస్ భారతి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వధూవరులను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం దంపతుల రాకతో పెళ్లి మంటపంలో సందడి మరింత అధికమైంది.
Go Back to Shorts
Jagan
Wedding
Raviprasad
Tadepalli
YS Bharathi
YSRCP
Andhra Pradesh

More Telugu News