IPL 2020: ఐపీఎల్ 2020 ప్లే ఆఫ్ షెడ్యూల్ ఇదే!

IPL Playoff Schedule Released
షార్ట్స్‌లో చూడండి
 ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ప్లేఆఫ్ షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించింది. ప్రస్తుత సీజన్ లో ఉన్న మూడు స్టేడియాల్లో షార్జాను వదిలేసి, దుబాయ్, అబూదాబి స్టేడియాలను మాత్రమే బీసీసీఐ ఎంచుకుంది. ఇక, పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న జట్లు ప్లే ఆఫ్ కు వెళతాయన్న సంగతి తెలిసిందే.

పాయింట్ల పట్టికలో టాప్ 1, 2 స్థానాల్లో ఉన్న జట్ల మధ్య క్వాలిఫయర్ మ్యాచ్ నవంబర్ 5న జరగనుంది. 6వ తేదీన టాప్ 3, 4 స్థానాల్లో ఉన్న జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఆ తరువాత 8వ తేదీన క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టు తలపడతాయి.

ఆపై దుబాయ్ వేదికగా, ఐపీఎల్ తుది సమరం జరుగుతుంది. అన్ని మ్యాచ్ లలు రాత్రి 7.30 గంటలకు మొదలు కానున్నాయి. కాగా, మూడు మహిళల టీమ్ ల మధ్య పొట్టి క్రికెట్ పోటీలను నిర్వహించాలని నిర్ణయించిన బీసీసీఐ, అన్ని మ్యాచ్ లకూ షార్జానే వేదికగా ప్రకటించినందువల్ల షార్జాలో ప్లే ఆఫ్ మ్యాచ్ లు ఉండబోవు.
Go Back to Shorts
IPL 2020
Women
Playoff
Matches

More Telugu News