ఇండియాలో కరోనా కేసులపై లేటెస్ట్ రిపోర్ట్!

Above 53 Thousand New Cases in India
  • 24 గంటల వ్యవధిలో 53,370 కొత్త కేసులు
  • 78 లక్షలు దాటిన మొత్తం కేసులు
  • 70 లక్షల మందికిపైగా రికవరీ
గడచిన 24 గంటల వ్యవధిలో ఇండియాలో 53,370 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఈ విషయాన్ని వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ, మొత్తం కేసులు 78,14,682కు చేరుకున్నాయని తెలిపింది. ఇదే సమయంలో మరో 650 మంది మహమ్మారి కారణంగా మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 1,17,956కు చేరింది.

ప్రస్తుతం ఇండియాలో 6,80,680 మందికి వివిధ నగరాలు, పట్టణాల్లోని ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోందని, శుక్రవారం నాడు 67,549 మంది రికవర్ అయ్యారని తెలిపింది. మొత్తం 70,16,046 మంది వ్యాధి భారినపడి కోలుకున్నారని వెల్లడించింది.
Go Back to Shorts
India
Corona Virus
New Cases

More Telugu News