ఈ నెల 28న అన్ని రాజకీయ పార్టీలతో ఏపీ ఎన్నికల సంఘం సమావేశం
- కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడిన స్థానిక ఎన్నికలు
- ఇప్పుడు స్థానిక ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు
- సాధారణ ప్రక్రియలో భాగంగానే సమావేశమన్న ఎస్ఈసీ
ఈమేరకు అన్ని రాజకీయ పార్టీలతో ఈ నెల 28న ఏపీ ఎన్నికల సంఘం సమావేశం అవుతోంది. స్థానిక ఎన్నికలపై ఈ సమావేశంలో ఆయా పార్టీల అభిప్రాయాలు తెలుసుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఓ ప్రకటన జారీ చేశారు. ఈ సమావేశాన్ని సాధారణ ప్రక్రియలో భాగంగానే నిర్వహిస్తున్నామని, కరోనా జాగ్రత్తలు తీసుకుని సమావేశం నిర్వహిస్తామని రమేశ్ కుమార్ పేర్కొన్నారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈ సమావేశం ఉంటుందని తెలిపారు.