Singapore: సింగపూర్‌లో బాలికకు బలవంతంగా ముద్దు.. భారత యువకుడికి ఏడు నెలల జైలు శిక్ష

Man jailed for 7 months for forcefully kissing in singapore
షార్ట్స్‌లో చూడండి
సింగపూర్‌లో ఓ బాలికను బలవంతంగా ముద్దుపెట్టుకున్న భారతీయ యువకుడికి కోర్టు ఏడు నెలల జైలు శిక్ష విధించింది. భద్రతా సమన్వయకర్తగా పనిచేసే చెల్లం రాజేశ్ కన్నన్ (26)కు భార్య, కుమార్తె ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా గతేడాది ఓ బాలిక (15) పరిచయం అయింది. అది క్రమంగా మెసేజ్‌లు పంపుకునే వరకు వెళ్లగా, గతేడాది ఆగస్టులో ఇద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత మరోమారు కలవడానికి కూడా బాలిక అంగీకరించింది.

తన స్నేహితులకు మద్యం తీసుకురావాలంటూ అంతకు మూడు రోజుల ముందు రాజేశ్‌ను బాలిక కోరింది. మద్యం సీసాలు తెస్తే తనకు ముద్దివ్వాలని రాజేశ్ అడిగాడు. అందుకు బాలిక తిరస్కరించింది. అయినప్పటికీ బాలికను బలవంతంగా ముద్దుపెట్టుకున్న యువకుడు.. మద్యం సీసాలు తెచ్చిన తనతో శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేశాడు. దీంతో బాలిక అతడిపై కేసు పెట్టింది.

కేసును విచారించిన కోర్టు నిందితుడికి ఏడు నెలల జైలు శిక్ష విధించింది. విచారణ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ.. చేసిన పనికి సిగ్గుపడుతున్నట్టు చెబుతూ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఈ కేసు వల్ల ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వచ్చిందని వాపోయాడు. ఉద్యోగం పోయిందని, చివరికి కుటుంబానికి కూడా దూరమయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు.
Go Back to Shorts
Singapore
kiss
court
jail
Social Media
girl

More Telugu News