రవితేజ 'ఖిలాడీ' ఫస్ట్ లుక్ విడుదల!

18-10-2020 Sun 10:30
Ravitejas Khiladi movies first look launched
  • 67వ చిత్రంలో నటించనున్న రవితేజ
  • తాజా చిత్రానికి 'ఖిలాడీ' టైటిల్ ఖరారు
  • ద్విపాత్రాభినయం చేస్తున్న రవితేజ

మాస్ మహరాజా రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. రవితేజ 67వ సినిమాకు సంబంధించి టైటిల్ తో పాటు, ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి 'ఖిలాడి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. రమేశ్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జయంతిలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ మూవీస్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాన్ని కాసేపట్లో ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండగా... డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 'మరో అద్భుత ప్రయాణానికి సర్వం సిద్ధం' అని రవితేజ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.