Delhi Capitals: రాణించిన హెట్మెయర్... ఢిల్లీ భారీ స్కోరు

  • రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
  • 45 పరుగులు చేసిన హెట్మెయర్
  • ఆర్చర్ కు 3 వికెట్లు
Delhi posted huge total against Rajasthan Royals

నేటి ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది. షిమ్రోన్ హెట్మెయర్ 24 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సులతో 45 పరుగులు చేశాడు. ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ 30 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఇతర బ్యాట్స్ మెన్ ఎవరూ పెద్దగా రాణించలేదు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 22, ఓపెనర్ పృథ్వీ షా 19 పరుగులు సాధించారు. చివర్లో అక్షర్ పటేల్ 8 బంతుల్లో 17 పరుగులు నమోదు చేశాడు.

ఈ మ్యాచ్ లో 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులేసిన రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీశాడు. కార్తీక్ త్యాగి, ఆండ్రూ టై, రాహుల తెవాటియో తలో వికెట్ పడగొట్టారు.

More Telugu News