Suryakumar Yadav: సూర్యకుమార్ సూపర్ ఇన్నింగ్స్... ముంబయి భారీ స్కోరు

  • అజేయంగా 79 పరుగులు చేసిన సూర్యకుమార్
  • ముంబయి 20 ఓవర్లలో 4 వికెట్లకు 193 రన్స్
  • రాణించిన రోహిత్, పాండ్య
Suryakumar Yadav hits a half century in style as Mumbai Indians posted huge total

రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసింది. వన్ డౌన్ లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సూర్యకుమార్ 47 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్ లతో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హార్దిక్ పాండ్య 19 బంతుల్లో 30 పరుగులు సాధించాడు.

అంతకుముందు, ఓపెనర్ రోహిత్ శర్మ 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్ లతో 35, మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 23 పరుగులు చేశారు. చిచ్చరపిడుగు ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. ఆడిన తొలి బంతికే వెనుదిరిగాడు. రాజస్థాన్ బౌలర్లలో శ్రేయాస్ గోపాల్ 2, జోఫ్రా ఆర్చర్ 1, కార్తీక్ త్యాగి 1 వికెట్ తీశారు.

More Telugu News