చైనా సైనికుల్లో పాక్ ఎన్ఎస్జీ కమాండోలు... ఈ వీడియోనే సాక్ష్యం!
- సోషల్ మీడియాలో చైనా సైనికుల వీడియో
- వారితో పాటు కనిపిస్తున్న ఓ గడ్డమున్న వ్యక్తి
- ట్రయినింగ్ కోసం పాక్ పంపిందంటున్న భారత నిపుణులు
చైనా పోలికలు ఎంతమాత్రమూ లేని ఈ వ్యక్తి ఎవరన్న విషయమై సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే సాగుతోంది. ఈ వీడియోను పరిశీలించిన భారత సైనిక నిపుణులు, అతను పాక్ కు చెందిన ఎన్ఎస్జీ కమాండో అయ్యుంటాడని అంచనా వేస్తున్నారు. పర్వత ప్రాంతాల్లో యుద్ధం ఎలా చేయాలి, ప్రణాళికలు ఎలా ఉండాలన్న విషయమై చైనా సైనికులకు విక్షణ ఇచ్చేందుకు వచ్చుంటాడని అంటున్నారు.