నేడు బిగ్ బాస్ వేదికపై అనుష్క... హోస్ట్ గా నాగ్ నుంచి బాధ్యతలు స్వీకరిస్తుందని వార్తలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేడు బిగ్ బాస్ వేదికపై అనుష్క... హోస్ట్ గా నాగ్ నుంచి బాధ్యతలు స్వీకరిస్తుందని వార్తలు!

Anyshka To Host Biggboss Temporarly
  • నేటి వేదికపై నాగ్ తో కలిసి కనిపించనున్న అనుష్క
  • తదుపరి కొన్ని వారాలు ఆమే వ్యాఖ్యాతంటున్న సోషల్ మీడియా
  • ఇప్పటికే షూటింగ్ జరిగిపోయిందని వార్తలు
టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో నేడు అందాల నటి అనుష్క సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. ఆమె నటించిన 'నిశ్శబ్దం' చిత్రం అక్టోబర్ 2న ఓటీటీలో విడుదల కానున్న నేపథ్యంలో బిగ్ బాస్ వేదికనే ప్రమోషనల్ ఈవెంట్ కు వేదికగా మార్చుకోవాలని అనుష్క భావించినట్టు తెలుస్తోంది. గత రెండురోజులుగా అనుష్క బిగ్ బాస్ వేదికపైకి రానుందని, ఇందుకు సంబంధించిన షూటింగ్ జరిగి పోయిందని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.

ఇక నేటి ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జునతో పాటు అనుష్క మరోసారి స్టేజ్ ని పంచుకోనుందని, అనుష్క కనిపించగానే కంటెస్టెంట్లు ఆశ్చర్యపోతారని అంటున్నారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకు వేసి, బిగ్ బాస్ కు అనుష్క రెండో మహిళా సెలబ్రిటీగా నిలుస్తారని, నాగ్ నుంచి ఆమె బాధ్యతలను స్వీకరిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ కు తొలి మహిళా వ్యాఖ్యాతగా రమ్యకృష్ణ వ్యవహరించిన సంగతి తెలిసిందే.

నాగార్జున తన పుట్టిన రోజు వేడుకల కోసం విదేశాలకు వెళ్లగా, ఆయన స్థానంలో రమ్యకృష్ణ కొన్ని రోజులు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక తదుపరి కొన్ని వారాల పాటు అనుష్కే హోస్ట్ గా వ్యవహరిస్తుందా?లేక కేవలం ఒక్క ఎపిసోడ్ కు మాత్రమే పరిమితమవుతారా? అన్న విషయం నేటి రాత్రికి తెలిసిపోతుంది.
Bigg Boss
Anushka
Nagarjuna

More Telugu News