Nithin: నితిన్ కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఖరారు!

Tamannah and Nabha Natesh to pair with Nithin
షార్ట్స్‌లో చూడండి
'భీష్మ' సినిమాతో మంచి విజయం అందుకున్న నితిన్ మరో సినిమాకు రెడీ అయిపోయాడు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'అంధాదున్' తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ  చిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ మూవీస్ పై సుధాకర్ రెడ్డి, నికితరెడ్డిలతో పాటు ఠాగుర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో నితిన్ సరసన తమన్నా, నభా నటేశ్ లను ఎంపిక చేసినట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హిందీలో టబు, రాధిక ఆప్టేలు పోషించిన పాత్రల్లో వీరు నటించనున్నారు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
Go Back to Shorts
Nithin
Tamannaah
Nabha Natesh
Tollywood

More Telugu News