బరువెక్కిన హృదయంతో ముంబైని వీడి వెళ్తున్నా: కంగనా రనౌత్
- ఒకప్పుడు ముంబైలో తల్లి స్పర్శను అనుభవించా
- ఇప్పుడు ముంబైలో బతికుండటమే లక్కీ అనిపిస్తోంది
- శివసేన పార్టీ సోనియాసేనగా మారిపోయింది
హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లే క్రమంలో తన హోమ్ టౌన్ చండీగఢ్ లో కంగనా ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా ఆమె మరో ట్వీట్ చేసింది. ఈసారికి తాను ముంబై నుంచి సురక్షితంగా బయటపడ్డానని చెప్పింది. ఒకానొక సమయంలో ముంబైలో తాను ఒక తల్లి స్పర్శను అనుభవించానని... కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముంబైలో తాను బతికుండటమే లక్కీ అనిపిస్తోందని తెలిపింది. ఎప్పుడైతే శివసేన పార్టీ సోనియాసేనగా మారిపోయిందో... ముంబై అధికార యంత్రాంగమంతా టెర్రర్ గ్రూపులా తయారైందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.