రియాను ఉక్కిరిబిక్కిరి చేసిన మీడియా... ఓ మహిళతో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అంటూ మంచు లక్ష్మి ఆగ్రహం
- ఎన్సీబీ విచారణకు హాజరైన రియా
- మీడియా ప్రతినిధుల మధ్యలో చిక్కుకుపోయిన రియా
- నీచాతినీచం అంటూ మంచు లక్ష్మి ట్వీట్
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా, చాలామంది రియా పరిస్థితి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. తాజాగా ఈ ఘటనపై టాలీవుడ్ సెలబ్రిటీ మంచు లక్ష్మి కూడా తీవ్రంగా స్పందించారు. "ఇది అత్యంత నీచాతినీచం కంటే ఎక్కువ. ఓ మహిళతో వ్యవహరించాల్సిన విధానం ఇది ఎంతమాత్రం కాదు. మరొకరి పట్ల ఇంత భయంకరంగా ఎలా ఉండగలరు? ఓ మనిషి పట్ల ఎలాంటి హుందాతనం చూపకుండా దారుణంగా వ్యవహరించారు. ఇలాంటి పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది" అంటూ మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.