చెన్నై సూపర్ కింగ్స్ కు మరో షాక్.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న హర్భజన్ సింగ్!
- ఇప్పటికే జట్టుకు దూరమైన రైనా
- నేను ఆడలేనని స్పష్టం చేసిన భజ్జీ
- వ్యక్తిగత కారణాల వల్ల ఆడలేనని వ్యాఖ్య
వ్యక్తిగత కారణాల వల్ల తాను ఈ సీజన్ లో ఆడటం లేదని వెల్లడించాడు. సీఎస్కే జట్టు సభ్యులందరూ ఇప్పటికే యూఏఈకి వెళ్లారు. భజ్జీ మాత్రం ఇండియాలోనే ఉండిపోయాడు. ఈ అంశంపై చర్చ జరుగుతుండగానే... భజ్జీ తాను ఆడలేనని ప్రకటించాడు. ఇప్పటికే సీఎస్కే జట్టును కరోనా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో, ఇద్దరు టాప్ ప్లేయర్లు దూరం కావడం ఆ జట్టుకు ఇబ్బందికర పరిణామమని చెప్పుకోవచ్చు.