Andhra Pradesh: ఏపీలో 4 లక్షలు దాటిన మొత్తం కరోనా కేసుల సంఖ్య!

Corona Positive cases in AP crosses 4 lacs
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో ఏకంగా 10,526 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 1,178, నెల్లూరు జిల్లాలో 1,151, పశ్చిమగోదావరి జిల్లాలో 986 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరో 81 మంది కరోనా కాటుకు బలయ్యారు.

తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,03,616కి చేరింది. మరణాల సంఖ్య 3,714కి చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం 96,191 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 61,331 కోవిడ్ టెస్టులను వైద్య సిబ్బంది నిర్వహించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Cases

More Telugu News