Madhavi Latha: తప్పు చేశాను... అందుకే చచ్చిపోతున్నా... నంద్యాల డెంటిస్ట్ మాధవీలత సూసైడ్ నోట్ వెల్లడి!

  • 16న నంద్యాలలో మాధవీలత ఆత్మహత్య
  • చేసిన పొరపాటుతో తీవ్ర మనస్తాపం
  • మరో వివాహం చేసుకోవాలని భర్తకు వినతి
Nandyal Dentist Madhavi Latha Sucide Note

ఈ నెల 16న కర్నూలు జిల్లా నంద్యాలలో డెంటిస్ట్ మాధవీలత ఆత్మహత్య వ్యవహారం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆమె భర్త మంచివాడేనని,తన కుమార్తెను చక్కగా చూసుకుంటాడని స్వయంగా మాధవీలత తల్లిదండ్రులు చెప్పగా, మాధవీలత డెడ్ బాడీ వద్ద సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులో ఏముందన్న విషయాన్ని బయటకు వెల్లడించక పోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. తొలుత కేసు విచారణలో భాగంగా ఆ లేఖను బయటపెట్డడం లేదని చెప్పిన పోలీసులు తాజాగా దాన్ని బయట పెట్టారు.

ఈ లేఖలో మాధవీలత, తాను తప్పు చేశానని, తనను క్షమించాలని భర్తను ఉద్దేశించి రాసింది. చేసిన పొరపాటుకు మనస్తాపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. బాధ్యతగా కొడుకును చక్కగా చూసుకోవాలని భర్తను కోరింది. భర్తతో తాను బాధ్యతగా ఉండలేకపోయానని చెబుతూ, మరో వివాహం చేసుకోవాలని కోరింది. ఎవరైనా ఎందుకు నీ భార్య ఆత్మహత్య చేసుకుందని అడిగితే, ఓ వ్యాధితో బాధపడుతూ తట్టుకోలేక చనిపోయిందని చెప్పాలని రాసిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కేసును మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

More Telugu News