Kurnool District: భర్త మంచోడే... డెంటిస్ట్ మాధవీలత ఆత్మహత్య వెనుక వీడని మిస్టరీ!

No Progress in Nandyal Madhavi Latha Sucide
షార్ట్స్‌లో చూడండి
కర్నూలు జిల్లా నంద్యాలలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న దంత వైద్యురాలు మాధవీలత కేసు వెనుక మిస్టరీ ఇంకా వీడలేదు. ఆమె భర్త మంచివాడని, తన కుమార్తెను చాలా బాగా చూసుకుంటాడని మాధవీలత తండ్రి చెబుతుండటంతో, ఆమె ఆత్మహత్యకు కారణాలు ఏంటన్న విషయమై పోలీసులు ఎటూ తేల్చలేకపోతున్నారు. ఆమె మృతదేహం వద్ద ఓ సూసైడ్ నోట్ లభించగా, అందులో ఏముందన్నది ఇప్పటివరకూ బయటకు రాలేదు. కేసు విచారణలో భాగంగా దాన్ని బయట పెట్టడం లేదని పోలీసులు అంటుండగా, అందులో ఏదో పెద్ద విషయమే ఉందన్న చర్చ జరుగుతోంది.

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మణ్ కిశోర్, గుంటూరుకు చెందిన మాధవీలత, 20 ఏళ్ల క్రితం ప్రేమించుకుని, కులాంతర వివాహం చేసుకున్నారు. వారిద్దరూ నంద్యాలకు వచ్చి, ఓ కాస్మోటిక్ దంత వైద్యశాలను ప్రారంభించి, సుఖంగా కాపురం చేసుకుంటున్నారు. ఇక్కడే ఇల్లు కూడా కొనుక్కొని స్థిర పడ్డారు. ఆర్థికంగా కూడా వారికి ఎలాంటి ఇబ్బందులూ లేవని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో 16వ తేదీన ఆమె సూసైడ్ చేసుకుంది. సూసైడ్ నోట్ దొరికినా, కేసు విషయంలో పురోగతి లేదు. ఆ నోట్ లో ఏముందో కూడా పోలీసు అధికారులు ఇంతవరకూ బయట పెట్టలేదు. దీంతో కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే, కేసు విచారణ సాగుతోందని నగర రెండో పట్టణ సీఐ వెల్లడించడం గమనార్హం.
Go Back to Shorts
Kurnool District
Nandyal
Madhavi Latha
Sucide
Police

More Telugu News