Schedule: తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్ విడుదల

Telangana common entrance tests schedule released
షార్ట్స్‌లో చూడండి
ఓవైపు కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తున్న నేపథ్యంలోనూ, విద్యార్థులు నష్టపోరాదన్న ఉద్దేశంతో తెలంగాణ సర్కారు కామన్ ఎంట్రన్స్ టెస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ జరపాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. తాజాగా పేర్కొన్న షెడ్యూల్ లో ఈసెట్ నుంచి ఎంసెట్ వరకు అన్ని పరీక్షల తేదీలు వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఓ ప్రకటన చేసింది.

ఈ సెట్- ఆగస్టు 31
ఎంసెట్ (ఇంజినీరింగ్)- సెప్టెంబరు 9, 10, 11, 14
ఎంసెట్ (అగ్రికల్చర్)- సెప్టెంబరు 28, 29
పీజీ ఈసెట్- సెప్టెంబరు 21 నుంచి 24 వరకు
ఐసెట్- సెప్టెంబరు 30, అక్టోబరు 1
ఎడ్ సెట్-అక్టోబరు 1, 3
లాసెట్- అక్టోబరు 4
Go Back to Shorts
Schedule
Common Entrance Test
Telangana
Corona Virus

More Telugu News