బీజేపీకి సలహాలు ఇచ్చే స్థాయి రఘురామకృష్ణరాజుకు లేదు: విష్ణువర్ధన్ రెడ్డి
- విజయవాడలో మీడియాతో మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డి
- వేరేవాళ్లు రఘురామకు పనులు అప్పగించారన్న ఏపీ బీజేపీ డిప్యూటీ
- ఆ పనులు చూసుకోవాలంటూ వ్యాఖ్యలు
అంతేకాదు, టీడీపీ నేతలపైనా ఆయన విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఓవైపు మోదీని పొగుడుతూ, మరోవైపు ఎమ్మెల్యేలతో తిట్టిస్తున్నారని, ఇది నీచ రాజకీయం అని విమర్శించారు. ఏపీలో ప్రతిపక్షంగా విఫలమైన టీడీపీ ఇప్పుడు కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సోము వీర్రాజు ఏపీ బీజేపీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి టీడీపీ ఎందుకు భయపడుతోందో ప్రజలకు తెలుస్తోందని అన్నారు.