రేప్ చేసి చంపేస్తామంటూ ఖుష్బూకు బెదిరింపులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేప్ చేసి చంపేస్తామంటూ ఖుష్బూకు బెదిరింపులు!

Khushboo gets rape threat call
  • సోషల్ మీడియాలో సదరు వ్యక్తి నంబర్ షేర్ చేసిన ఖుష్బూ
  • పశ్చిమబెంగాల్ నుంచి వచ్చిన కాల్
  • మమతాబెనర్జీకి ట్యాగ్ చేసిన ఖుష్బూ
ప్రముఖ సినీనటి, తమిళనాడు కాంగ్రెస్ నాయకురాలికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపులు వచ్చాయి. అత్యాచారం చేసి చంపేస్తామంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. అయితే ఆ కాల్ పశ్చిమబెంగాల్ నుంచి వచ్చిందని ట్రూకాలర్ ద్వారా తెలుసుకున్న ఖుష్బూ... ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆ వ్యక్తి నంబర్ ను కూడా షేర్ చేశారు.

అంతేకాదు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి కూడా ట్యాగ్ చేశారు. దీదీ... నాలాంటి వ్యక్తులకే బెదిరింపులు ఎదురవుతున్నాయంటే... ఇతర మహిళల పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి అని పేర్కొన్నారు. ఇలాంటి పనులు చేసే వ్యక్తుల పరువు పబ్లిక్ గా తీయాలని ఓ నెటిజన్ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

ఇటీవలి కాలంలో ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా పలు సంచలన కామెంట్లు చేశారు. జాతీయ విద్యా విధానం విషయంలో సొంత పార్టీ నేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా స్పందించారు. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ... రాముడి కంటే మోదీని ఎక్కువ చేస్తున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు.
Khushboo
Threat Call
Tollywood

More Telugu News