సుశాంత్ మృతి కేసు.. సుప్రీంకోర్టులో రియాకు ఎదురుదెబ్బ
- రియా చక్రవర్తికి రక్షణ కల్పించేందుకు నిరాకరించిన కోర్టు
- కేసును బీహార్ నుంచి ముంబైకి బదిలీ చేసేందుకూ నిరాకరణ
- మూడు రోజుల్లో దర్యాప్తు వివరాలను సమర్పించాలని పోలీసులకు ఆదేశం
అలాగే, మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని సంబంధిత పార్టీలను జస్టిస్ హృషికేశ్ రాయ్ సారథ్యంలోని ఏక సభ్య ధర్మాసనం ఆదేశించింది. రియాకు ప్రొటెక్షన్ కల్పించేందుకు కోర్టు నిరాకరించడంతో బీహార్ పోలీసులు ఏ సమయంలోనైనా రియాను ప్రశ్నించే అవకాశం ఉంది. సుశాంత్ మృతి కేసులో పాట్నాలో నమోదైన ఎఫ్ఐఆర్‌ను ముంబైకి బదిలీ చేయాలంటూ రియాచక్రవర్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు పై ఆదేశాలు జారీ చేసింది.