సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- థ్యాంక్స్ చెబుతున్న శ్రుతి హాసన్
- కేతిక శర్మకు తెలుగులో మరో సినిమా
- అజిత్ కోసం రామోజీ ఫిలిం సిటీలో సెట్
* ప్రస్తుతం ఆకాశ్ పూరి సరసన 'రొమాంటిక్' చిత్రంలో నటిస్తున్న కేతిక శర్మ తెలుగులో మరో చిత్రానికి సంతకం చేసింది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా నటించే చిత్రంలో కథానాయికగా కేతికను బుక్ చేసినట్టు సమాచారం.
* ప్రముఖ తమిళ నటుడు అజిత్ హీరోగా నటిస్తున్న 'వాలిమై' చిత్రం షూటింగు వచ్చే నెల నుంచి హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఫిలిం సిటీలో ప్రత్యేకమైన సెట్ ను వేస్తున్నారు.