మరో చిత్రానికి ఓకే చెప్పిన అనుష్క!
- 'బాహుబలి' తర్వాత తగ్గిన అనుష్క క్రేజ్
- థియేటర్ల మూసివేతతో విడుదల కాని 'నిశ్శబ్దం'
- విజయ్ సేతుపతి చిత్రానికి గ్రీన్ సిగ్నల్
దీంతో ఆమె ఇక పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోతుందంటూ ఈమధ్య వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అనుష్క తాజాగా ఓ తమిళ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఆమె కథానాయికగా నటించనుందని అంటున్నారు. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. గతంలో ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో అనుష్క రెండు సినిమాలు చేసింది. ఆ పరిచయం కారణంగానే ఈ చిత్రానికి ఆమె ఓకే చెప్పిందని సమాచారం.