సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Keerti Suresh opposite Kamala hassan
  • కమలహాసన్ సరసన కీర్తి సురేశ్ 
  • మరో నూతన దర్శకుడితో సాయితేజ్ 
  • భారీ బడ్జెట్టుతో తేజ చిత్రం
*  ప్రస్తుతం 'అన్నాత్తే' చిత్రంలో రజనీకాంత్ సరసన నటిస్తున్న కథానాయిక కీర్తి సురేశ్ త్వరలో ప్రముఖ నటుడు కమలహాసన్ పక్కన కూడా నటించనుంది. గతంలో వచ్చిన 'వెట్టియాడు వెలైయాడు' (తెలుగులో రాఘవన్) చిత్రానికి ఇప్పుడు కమల్ తో గౌతమ్ మీనన్ సీక్వెల్ చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేశ్ ని కథానాయికగా తీసుకుంటున్నారట.      
*  ప్రస్తుతం నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో 'సోలో బ్రతుకే సో బెటరు' చిత్రాన్ని చేస్తున్న సాయితేజ్ మరో నూతన దర్శకుడికి చాన్స్ ఇస్తున్నాడు. నరేశ్ అనే కొత్త కుర్రాడు చెప్పిన కథ నచ్చడంతో అతని దర్శకత్వంలో చేయడానికి ఓకే చెప్పాడట. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మిస్తారు.
*  గోపీచంద్ హీరోగా తేజ దర్శకత్వంలో 'అలిమేలుమంగ వెంకటరమణ' చిత్రం రూపొందనున్న సంగతి విదితమే. ఇందులో కీర్తి సురేశ్ కథానాయికగా నటించనుంది. విశేషం ఏమిటంటే, ఈ చిత్రాన్ని 30 కోట్ల బడ్జెట్టుతో నిర్మిస్తున్నారట. ప్రస్తుత పరిస్థితులలో గోపీచంద్ మార్కెట్టుకి ఇది ఎక్కువనే చెప్పాలి.
Keerti Suresh
Rajaneekanth
Kamala hassan
Saitej
Gopichand

More Telugu News