David Warner: టిక్‌టాక్‌పై నిషేధం నేపథ్యంలో డేవిడ్‌ వార్నర్‌పై అశ్విన్‌ ట్వీట్ వైరల్! ‌

  • భారతీయ పాటలకు డ్యాన్సులతో ఫేమస్ అయిన వార్నర్
  • టిక్‌టాక్‌లో 4.8 ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న క్రికెటర్  
  • ‘అప్పో అన్వర్‌?’ అంటూ డేవిడ్ వార్నర్‌కు అశ్విన్ ట్వీట్
ashwin tweet on warner goes viral

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాటకు స్టెప్పులు వేయడంతో మొదలు పెట్టి రెండు రోజుల క్రితం 'టాపులేచి పోద్ది' అనే తెలుగు పాటకు భార్య, పిల్లలతో కలిసి ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ డ్యాన్స్‌ చేశాడు.

భారతీయ సినిమా పాటలకు ఆయన చేసిన డ్యాన్సుల వల్ల ఇండియాలో ఆయన ఫేమస్‌ అయిపోయాడు. అయితే, భారత్‌లో టిక్‌టాక్‌ యాప్‌ను నిషేధించిన నేపథ్యంలో వార్నర్ గురించి భారత క్రికెటర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఓ ట్వీట్‌ చేశాడు.

‘అప్పో అన్వర్‌?’ అంటూ డేవిడ్ వార్నర్‌కు ట్వీట్ చేస్తూ నవ్వుతోన్న ఎమోజీని ట్వీట్ చేశాడు. భారత్‌లో చైనా యాప్‌లను బ్యాన్‌ చేసిన విషయానికి సంబంధించిన వార్తను పోస్ట్ చేశాడు. వార్నర్‌ను ట్రోల్‌ చేస్తూ ఆయన చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి భారీగా స్పందన వస్తోంది.

గతంలో వార్నర్‌ చేసిన డ్యాన్సుల వీడియోలను పోస్ట్ చేస్తూ అవి ఎప్పటికీ గుర్తుండి పోతాయని, బాధపడొద్దని కామెంట్లు చేస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేయాలంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. కాగా, భారతీయ పాటలకు వీడియోలు చేస్తూ టిక్‌టాక్‌లో వార్నర్‌ ఏకంగా 4.8 ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు.

More Telugu News