ap7am logo

దేశంలో ఒక్క రోజులో 19,906 మందికి కరోనా సోకిన వైనం

Sun, Jun 28, 2020, 10:02 AM
19906 coronavirus cases in India in 24 hours in biggest one day jump
  • కరోనా కేసుల సంఖ్య మొత్తం 5,28,859
  • మృతుల సంఖ్య మొత్తం 16,095
  • 2,03,051 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • కోలుకున్న 3,09,713 మంది  
భారత్‌లో కొవిడ్‌-19 కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 19,906 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 410 మంది మరణించారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 5,28,859కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 16,095కి పెరిగింది. 2,03,051 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,09,713 మంది కోలుకున్నారు.

కాగా, జూన్‌ 26 వరకు దేశంలో మొత్తం 82,27,802 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,31,095 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad