Lockdown: ప్రశాంతంగా పొలం పనుల్లో వైసీపీ ఎంపీ మాధవి!

YSRCP MP Madhavi Busy With Farming
షార్ట్స్‌లో చూడండి
కరోనా మహమ్మారి ఉద్ధృతం, లాక్ డౌన్ నిబంధనల అమలుతో నియోజకవర్గానికే పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా నేత, అరకు ఎంపీ గొట్డేటి మాధవి, తన పొలంలో పనులు చేస్తూ కాలం గడుపుతున్నారు. తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే గుడి దేవుడి నుంచి సంక్రమించిన భూమిలో ఆమె స్వయంగా దుక్కి దున్ని విత్తనాలు జల్లి పొలం పనుల్లో పాల్గొన్నారు. స్వగ్రామమైన శరభన్న పాలెం నుంచి నిమ్మగడ్డ వెళ్లే దారిలో ఉన్న తమ భూమిలో భౌతికదూరం పాటిస్తూ, ఆమె పొలం పనులు చేస్తున్న చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వ్యవసాయ పనులు చేయడం తనకు అలవాటేనని, వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Lockdown
Goddeti Madhavi
Araku
YSRCP
MP

More Telugu News