Allu Sirish: గ్రహణం రోజున పూజలు చేయకుంటే ఇలాగే జరుగుతుంది మరి: అల్లు శిరీశ్

  • సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు శిరీశ్
  • టవర్ గేమ్ లో విఫలమైన వీడియో
  • పెట్టిన కామెంట్ తో నెటిజన్లకు నవ్వులు
Allu Sirish Video in Instagram goes viral

యంగ్ హీరో అల్లు శిరీశ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. త్వరలోనే తన తదుపరి చిత్రాల గురించిన అప్ డేట్స్ ఇస్తానని ఇటీవలే చెప్పిన శిరీశ్, సూర్య గ్రహణం రోజున పెట్టిన ఓ వీడియో నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తోంది.

చెక్కలతో నిటారుగా ఉన్న టవర్ నుంచి ఒక్కో ముక్కనూ తీసే ఆటలో, అల్లు అర్జున్ ఓ చెక్కను తీయగా, టవర్ మొత్తం కూలిపోయింది. ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన అల్లువారబ్బాయి, సూర్యగ్రహణం రోజున సరిగ్గా పూజలు చేయకుంటే ఇలాగే జరుగుతుంది మరి అని కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్ ను చదివిన వారంతా నవ్వుకుంటూ, వీడియోకన్నా కామెంట్ ఫన్నీగా ఉందని అంటున్నారు.

More Telugu News