Anil Kumar Poluboina: తొడగొట్టిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. శాసనమండలిలో తీవ్ర గందరగోళం!

  • బీసీలను అణగదొక్కుతున్నారన్న నాగ జగదీశ్వరరావు
  • ముద్రగడను టీడీపీ అరెస్ట్ చేయించిందన్న అనిల్
  • ఆందోళనకు దిగిన టీడీపీ సభ్యులు
Anil Kumar Yadav fire on TDP member in Council

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వర్ తో ఆయనకు కాసేపు వాగ్వాదం నడిచింది. ఈ సందర్భంగా మంత్రి ఆవేశానికి గురై... సభలో తొడగొట్టారు.

నాగ జగదీశ్వరరావు మండలిలో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు అంశాన్ని లేవనెత్తారు. బీసీ నాయకులను అణగదొక్కుతున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ... అచ్చెన్న తప్పు చేశాడు కాబట్టే జైలుకు వెళ్లాడని అన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ కల్పించుకుని... ముద్రగడ అంశాన్ని ప్రస్తావించారు. కాపు ఉద్యమం సమయంలో మూడు వేల మంది పోలీసులతో ఆయనను అరెస్ట్ చేయించారని... దీన్ని ఎలా చూడాలని ప్రశ్నించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన మంత్రి అనిల్ తొడగొట్టారు. తనను ఓడించేందుకు కోట్ల రూపాయలను ఖర్చు చేశారని... అయినా తాను గెలిచి, సభకు వచ్చానని అన్నారు. ఈ క్రమంలో సభలో తీవ్ర గందరగోళం నెలగొనడంతో మండలి ఛైర్మన్ సభను వాయిదా వేశారు.

More Telugu News