vennela kishore: కరోనాతో సహజీవనంపై వెన్నెల కిశోర్ ఆసక్తికర వీడియో

  • తాను నటిస్తోన్న సినిమాకు‌ డబ్బింగ్‌ చెప్పిన నటుడు
  • అక్కడున్న వస్తువులపై శానిటైజ్
  • రికార్డింగ్‌ మైక్‌పై కూడా స్ప్రే
  • 'లబ్‌ డబ్‌ లబ్‌ డబ్‌ లబ్‌ డబ్బింగ్‌.. బిక్కు బిక్కు జీవితం'  
vennela kishore about life with corona

కరోనాతో సహజీవనంపై హాస్యనటుడు వెన్నెల కిశోర్ ఆసక్తికర వీడియోను పోస్టు చేశాడు. ఆయన తాజాగా తాను నటిస్తోన్న సినిమాకు‌ డబ్బింగ్‌ చెప్పాడు. ఈ సందర్భంగా అక్కడున్న వస్తువులపై శానిటైజ్‌ చేశారు. రికార్డింగ్‌ మైక్‌పై కూడా ఆయన స్ప్రే చల్లాడు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ 'లబ్‌ డబ్‌ లబ్‌ డబ్‌ లబ్‌ డబ్బింగ్‌.. బిక్కు బిక్కు జీవితం' అంటూ కామెంట్ చేశాడు.

డబ్బింగ్‌ చెప్పడానికి ముందు స్ప్రే చేసుకోవాలని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తనదైన ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ అలరించాడు. కరోనా నేపథ్యంలో షూటింగులు బంద్‌ కావడంతో సినీనటులు ఇంటికే పరిమితమయ్యారు. ఈ సందర్భంగా తీసుకుంటోన్న వీడియోలు, ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకర్షిస్తున్నారు. చాలా మంది డబ్బింగ్‌ పనులను పూర్తి చేసుకుంటున్నారు.

More Telugu News