Madhavi Latha: పెయిడ్ క్వారంటైన్ లు కూడా సిద్ధం చేశాం: ‘కృష్ణా‘ జేసీ మాధవీలత

షార్ట్స్‌లో చూడండి
లాక్ డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారు రేపు గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టరు, పర్యవేక్షాణాధికారి మాధవీలత మీడియాతో మాట్లాడారు. వచ్చిన వారందరినీ 14 రోజుల పాటు క్వారంటైన్ కు తరలిస్తామని చెప్పారు. ప్రభుత్వ క్వారంటైన్ లో ఉండేందుకు ఇష్టపడని వారి కోసం,పెయిడ్ క్వారంటైన్ లు కూడా సిద్ధం చేశామని, నాలుగు కేటగిరీలుగా రూమ్ లను కేటాయించామని అన్నారు.

విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సుల్లో హోటల్స్ కు తరలిస్తామని, 14 రోజుల తర్వాత ‘కరోనా’ పరీక్షలు చేసి నెగిటివ్ వస్తేనే ఇళ్లకు పంపుతామని అన్నారు. పెయిడ్ క్వారంటైన్స్ వద్ద మెడికల్, పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటులో ఉంటారని, పోలీసుల పర్యవేక్షణలో ప్రత్యేక నిఘా ఉంటుందని అన్నారు. ఆరోగ్యసేతు యాప్ లో అందరినీ రిజిస్టర్ చేస్తామని, విదేశాల నుంచి వచ్చిన వారందరికీ ఇండియా సిమ్ కార్డులు ఇస్తామని వివరించారు.

కాగా, విదేశాల నుంచి ముంబైకు చేరుకుని అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రానున్నారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు తరలించనున్నారు. కృష్ణా, ఉభయగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన రెండు వేల మంది గన్నవరం ఎయిర్ పోర్టుకు రావొచ్చని అంచనా.
Go Back to Shorts
Madhavi Latha
Joint collector
Krishna District

More Telugu News