ఎన్టీఆర్ తో వంశీ పైడిపల్లి .. 'బృందావనం' సీక్వెల్?
- మహేశ్ తో పట్టాలెక్కని ప్రాజెక్టు
- ఎన్టీఆర్ కోసం కథపై కసరత్తు
- గతంలో హిట్ కొట్టిన 'బృందావనం'
ఎన్టీఆర్ .. సమంత .. కాజల్ ప్రధాన పాత్రధారులుగా వంశీ పైడిపల్లి చేసిన 'బృందావనం' 2010లో భారీ విజయాన్ని సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ సినిమా సీక్వెల్ కి సంబంధించిన కథను వంశీ పైడిపల్లి సిద్ధం చేయడం కూడా జరిగిపోయిందని చెబుతున్నారు. త్వరలోనే ఆయన ఎన్టీఆర్ కి ఆ కథను వినిపించనున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమా తరువాత వంశీ పైడిపల్లితో ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళతాడేమో చూడాలి మరి.