'కేజీఎఫ్' దర్శకుడితో ప్రభాస్ సినిమా ఖాయమైనట్టే!
- రాధాకృష్ణకుమార్ తో తాజా చిత్రం
- నాగ్ అశ్విన్ దర్శకత్వంలోనూ భారీ చిత్రం
- లైన్లో దర్శకుడు ప్రశాంత్ నీల్
ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ తో కలిసి ప్రభాస్ సెట్స్ పైకి వెళతాడని అంటున్నారు. 'కేజీఎఫ్' సినిమాతో పాప్యులర్ అయిన ప్రశాంత్ నీల్, ఆ సినిమాకి సీక్వెల్ చేస్తున్నాడు. అది పూర్తయిన తరువాత ప్రభాస్ స్క్రిప్ట్ పై కూర్చుంటాడని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలుస్తోంది.