గొప్ప అభిమానిని పొందినందుకు సంతోషంగా వుంది: అనసూయ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గొప్ప అభిమానిని పొందినందుకు సంతోషంగా వుంది: అనసూయ

Anasuya
  • మా అమ్మగారు సినిమాలు చూడరు
  • ఆ మధ్య 'రంగస్థలం' మాత్రం చూశారు
  • అప్పటి నుంచి మీ అభిమానిగా మారిపోయారన్న నెటిజన్
అనసూయకి యూత్ లో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తనకి గల క్రేజ్ కి తగినట్టుగానే నచ్చిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటోంది. ఆయా పాత్రల ద్వారా ఆమె అభిమానులకు మరింత చేరువవుతోంది. సోషల్ మీడియా ద్వారా తన పట్ల అభిమానులు చూపుతున్న ఆదరణకు ఆమె సంతోషంతో పొంగిపోతోంది.

తాజాగా ఒక అభిమాని ఆమెతో మాట్లాడుతూ .. "మా అమ్మగారు పెద్దగా సినిమాలు చూడదు. అందువలన సినిమా తారల్లో ఆమె ఇష్టపడేవారు కూడా ఎవరూ లేరు. అలాంటి మా అమ్మగారు ఆ మధ్య 'రంగస్థలం' సినిమా చూశారు. అప్పటి నుంచి ఆమె మీ అభిమానిగా మారిపోయారు. ఈ స్థాయిలో మా అమ్మగారి అభిమానాన్ని పొందినవారు లేరు" అంటూ రాసుకొచ్చాడు. అందుకు అనసూయ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ .. "మీ అమ్మగారికి నా ధన్యవాదాలు తెలియజేయండి .. ఇంతగొప్ప అభిమానిని పొందినందుకు ఆనందంగా వుంది" అంటూ అనసూయ సమాధానమిచ్చింది.
Anasuya
Anchor
Tollywood

More Telugu News