ఎండలో వెళుతున్న బాలింత... అనంత పోలీసుల మానవత్వం!
- కల్యాణదుర్గంలో విధుల్లో ఉన్న పోలీసులు
- భర్తతో కలిసి చంటిబిడ్డతో వెళుతున్న మంగమ్మ
- తన వాహనంలో ఇంటికి పంపిన డీఎస్పీ
స్థానిక హిందూపురం రోడ్ లో ఆయన తన సిబ్బందితో విధుల్లో ఉన్న వేళ, ఈ నెల 13న ఆర్టీటీ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన ఉప్పొంక గ్రామానికి చెందిన మంగమ్మ అనే మహిళను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతూ పోలీసుల కంటపడింది. వివరాలు తెలుసుకున్న డీఎస్పీ, ఎండలో అంతదూరం వెళ్లడం తల్లికి, బిడ్డకు క్షేమం కాదని, తన వాహనంలో ఆమెను ఇంటికి పంపించారు.