MS Dhoni: బెస్ట్ కెప్టెన్ కోహ్లీ కాదు... ధోనీ, రోహిత్ లేనట... 20 మంది ఐపీఎల్ నిపుణుల జ్యూరీ!

Not Kohli Dhoni and Rohit Best Captains of IPL
షార్ట్స్‌లో చూడండి
భారత క్రికెట్ జట్టు అత్యుత్తమ కెప్టెన్ లు ఎవరన్న ప్రశ్న ఎదురైతే, చాలా మంది పేర్లే సమాధానంగా వస్తాయి. కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ వంటి పేర్లు వినిపిస్తాయి. ఇక, ఐపీఎల్ లో అత్యుత్తమ కెప్టెన్లు ఎవరన్న ప్రశ్న ఎదురైతే... దాదాపు 20 మంది మాజీ క్రికెటర్లు, క్రీడా జర్నలిస్టులు, నిపుణులతో కూడిన స్టార్ స్పోర్ట్స్ ప్రత్యేక జ్యూరీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఐపీఎల్ లో ఎంఎస్‌ ధోని, రోహిత్‌ శర్మలు బెస్ట్ కెప్టెన్లని జూరీ సభ్యులు తేల్చారు. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌ నాలుగు సార్లు, ధోని సారథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మూడు సార్లు టైటిల్‌ గెలిచిన విషయాన్ని వారు గుర్తు చేశారు.

ఇక ఇదే సమయంలో మిగతా అవార్డులను పొందిన వారి వివరాలను కూడా జ్యూరీ ప్రకటించింది. ఐపీఎల్‌ బెస్ట్‌ బ్యాట్స్‌ మన్‌ గా ఏబీ డివిలియర్స్, భారత అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా విరాట్ కోహ్లీ, ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ బౌలింగ్‌ విభాగంలో నిలిచారని వెల్లడించింది. బెస్ట్ ఆల్ రౌండర్ గా షేన్ వాట్సన్, సీఎస్‌కే ప్రధాన కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ఉత్తమ కోచ్‌ గా ఎంపికయ్యారు. 
Go Back to Shorts
MS Dhoni
Rohit Sharma
Virat Kohli
IPL

More Telugu News