రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న వల్లభనేని వంశీ?
- నా కష్టసుఖాల్లో వెన్నంటి నిలిచిన అందరికీ ధన్యవాదాలు అన్న వంశీ
- రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ
- పోస్టును డిలీట్ చేసిన వంశీ
వైసీపీలో కూడా వల్లభనేని వంశీ ఇమడలేకపోతున్నారా? రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నారా? అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. వాస్తవానికి వైసీపీలో అధికారికంగా వంశీ చేరకపోయినప్పటికీ... ముఖ్యమంత్రి జగన్ కు మద్దతిస్తున్నారు. అసెంబ్లీలో సైతం ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు.
చంద్రబాబు, లోకేశ్, టీడీపీలపై ఆయన చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియాలో వంశీ చేసిన కామెంట్ తో మళ్లీ చర్చ మొదలైంది. వైసీపీ శిబిరంలో వంశీ ఇమడలేకపోతున్నారా? సొంత నియోజకవర్గంలో తగిన ప్రాధాన్యత దక్కలేదా? అని చర్చించుకుంటున్నారు. మరోవైపు, ఈ పోస్టు వైరల్ అయిన నేపథ్యంలో... దాన్ని వంశీ తొలగించారు.