అనిల్ రావిపూడితో చరణ్ మూవీ

Anil Ravipudi Movie
  • చరణ్ తాజా చిత్రంగా 'ఆర్ ఆర్ ఆర్'
  • 'ఆచార్య' తరువాత లైన్లో మరో సినిమా
  • నిర్మాతగా డీవీవీ దానయ్య    
ప్రస్తుతం చరణ్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన 'ఆచార్య' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేయనున్నాడు. ఆ తరువాత చరణ్ ఏ దర్శకుడితో సెట్స్ పైకి వెళ్లనున్నాడనేది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో చరణ్ తదుపరి సినిమా దర్శకుడిగా అనిల్ రావిపూడి పేరు వినిపిస్తోంది.

యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ పాళ్లను సమానంగా కలిపి వినోదాన్ని అందించే దర్శకుడిగా అనిల్ రావిపూడికి మంచి పేరుంది. ప్రస్తుతం ఆయన 'ఎఫ్ 2' సినిమాకి సీక్వెల్ గా 'ఎఫ్ 3'  చేయడానికి సిద్ధమవుతున్నాడు. అలాంటి అనిల్ రావిపూడి తాజాగా చరణ్ కి కథ వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. చరణ్ 'ఆచార్య' పూర్తి చేసేలోగా, అనిల్ రావిపూడి 'ఎఫ్ 3' పూర్తి చేస్తాడట. ఆ తరువాత ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళతారని చెబుతున్నారు. ఈ సినిమాకి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తాడట.
Go Back to Shorts
Charan
Koratala Siva
Anil Ravipudi

More Telugu News