Lavanya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • లావణ్య త్రిపాఠికి మరో ఛాన్స్ 
  • హిందీ సినిమాలో అజిత్
  • సీక్వెల్స్ ప్లాన్ లో అనిల్ రావిపూడి  
Lavanya Tripathi opposite Varun Tej

 *  కథానాయిక లావణ్య త్రిపాఠి తాజాగా వరుణ్ తేజ్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. వరుణ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్రకు లావణ్యను తీసుకున్నట్టు సమాచారం.
*  తమిళ స్టార్ హీరో అజిత్ మళ్లీ బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం కనిపిస్తోంది. తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ తాజాగా సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా కార్గిల్ వార్ నేపథ్యంలో హిందీలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో ఆర్మీ మేజర్ పాత్ర ఒకటుందట. ఈ పాత్రలో నటించవలసిందిగా విష్ణువర్ధన్ ఇటీవల అజిత్ ను సంప్రదించాడని, ఆయన ఓకే చెప్పాడని వార్తలొస్తున్నాయి. గతంలో 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రంలో అజిత్ గెస్ట్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే.
*  గతంలో తాను రూపొందించిన 'ఎఫ్ 2' హిట్ చిత్రానికి దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు 'ఎఫ్ 3' పేరిట సీక్వెల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కూడా వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. కాగా, దీని తర్వాత ఈ పాత్రలను పొడిగిస్తూ ఎఫ్ 4, ఎఫ్ 5 చిత్రాలను కూడా చేయాలని అనిల్ రావిపూడి నిర్ణయం తీసుకున్నాడట.

More Telugu News