Rangoli Chandel: కంగనా రనౌత్ సోదరి అకౌంట్ ను నిలిపివేసిన ట్విట్టర్

Twitter suspends Rangoli Chandel account
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తరఫున అత్యంత బలంగా గళం వినిపించే ఆమె సోదరి రంగోలీ చందేల్ ట్విట్టర్ అకౌంట్ మూగబోయింది. ట్విట్టర్ లో రంగోలీ ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా, బాలీవుడ్ అంశాలపై ఘాటు వ్యాఖ్యలతో చురుకు పుట్టిస్తుంటారు. ఆమె కామెంట్లు వివాదాస్పదమైన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటనపై ఆమె ట్వీట్ చేయగా, అది నిబంధనలకు వ్యతిరేకమంటూ ట్విట్టర్ ఘాటుగా స్పందించింది. రంగోలీ అకౌంట్ ను నిలిపివేసింది.

యూపీలోని మొరాదాబాద్ లో ఓ వ్యక్తి మరణించగా, వైద్యపరీక్షలు చేస్తే కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించేందుకు వైద్య సిబ్బంది, పోలీసులు రాగా స్థానికులు వారిపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి రంగోలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. రంగోలీ వ్యాఖ్యలపై బాలీవుడ్ ఫిలింమేకర్ రీమా కగ్టి తీవ్రంగా స్పందించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ముంబయి పోలీసులను ట్విట్టర్ లో ట్యాగ్ చేశారు.
Go Back to Shorts
Rangoli Chandel
Kangana Ranaut
Twitter
Account
Suspension

More Telugu News