Jagan: ‘కరోనా’ కేసులు ఎక్కువ ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించండి: సీఎం జగన్ ఆదేశాలు

AP CM Jagan review on coronoa virus
షార్ట్స్‌లో చూడండి
‘కరోనా’ నివారణా చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష ముగిసింది. ‘కరోనా’ కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మాస్కుల తయారీని స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని, తొలుత ‘కరోనా’ హాట్ స్పాట్ ప్రాంతాల్లో మాస్కులు పంపిణీ చేయాలని, ప్రతి ఒక్కరికీ 3 మాస్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం తప్పక పాటించేలా నిబంధనలు అమలు చేయాలని సూచించారు.

రేపటి నుంచి మాస్కుల పంపిణీ ప్రారంభిస్తామని, రెండు రోజుల తర్వాత మాస్కుల పంపిణీ విస్తృతం చేస్తామని జగన్ కు అధికారులు తెలిపారు. క్వారంటైన్ ప్రాంతాల్లో సదుపాయాలపై నిరంతరం దృష్టి పెట్టాలని, క్వారంటైన్ పూర్తి చేసుకుని తమ ఇళ్లకు వెళ్లే వాళ్లకు రూ.2 వేల చొప్పున అందజేయాలని ఆదేశించారు.

రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను, మత్స్య కార భరోసా లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని జగన్ ఆదేశించారు. ఆర్టీకే కేంద్రంగా చేసుకుని మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహించాలని, ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతి చేసేందుకు ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడాలని, సరికొత్త పద్ధతుల్లో ఆక్వా ఉత్పత్తుల విక్రయానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Andhra Pradesh
Corona Virus

More Telugu News