ఎన్టీఆర్ మూవీలో రాజకీయ నాయకుడిగా సంజయ్ దత్?
- త్రివిక్రమ్ నుంచి 'అయినను పోయిరావలె హస్తినకు'
- రాజకీయాల నేపథ్యంలో సాగే కథాకథనాలు
- అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్
ఆ పాత్రకి సంజయ్ దత్ అయితే కరెక్టుగా సెట్ అవుతాడనే ఉద్దేశంతో, ఆయనను దృష్టిలో పెట్టుకునే త్రివిక్రమ్ ఆ పాత్రను డిజైన్ చేస్తున్నాడని అంటున్నారు. ఈ పాత్ర గురించి సంజయ్ దత్ కి చెప్పి ఆయనను ఒప్పించగలననే నమ్మకంతోనే త్రివిక్రమ్ వున్నాడని చెబుతున్నారు. సంజయ్ దత్ కారణంగా సినిమాకి మరింత భారీతనం వస్తుందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన నాయికలుగా జాన్వీ కపూర్ .. పూజ హెగ్డే పేర్లు వినిపిస్తున్నాయి. అక్టోబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి, వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.